ఆర్టీసీలో ఆనందోత్సాహం


Tue,December 3, 2019 12:59 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు కురిపించిన వరాల జల్లుతో వారిలో ఆనందం ఉప్పొంగుతోంది. కార్మికులను ఉద్యోగులుగా పిలవడంతోపాటు వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కార్ చేపట్టే కార్యక్షికమాల నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ పెంపుతో పాటు మహిళలకు ప్రసూతి సెలవుల పెంపు, ఇతర అంశాల విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు సమ్మె కాలంలోని వేతనం అందజేయడంతో పాటు సెప్టెంబర్‌కు సంబంధించి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం విధితమే. సమ్మె అనంతరం ఏ షరతు లేకుండా వారిని ఉద్యోగాలకు తీసుకోవడంతో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి డిపోల్లో కార్మికులు ఆనందంగా చేరుకున్నారు. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి ఏ రాష్ట్రంలోను ఉండడని కీర్తిస్తు విధుల్లో చేరుతున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...