సీఎంఆర్ డెలివరీ సకాలంలో చేయాలి


Tue,December 3, 2019 12:59 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: రైస్ మిల్లర్లు కస్టమ్ మి ల్లింగ్ బి య్యం డెలివరీని సకాలం లో అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రైస్‌మిల్లర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు , సీఎంఆర్, సన్న బియ్యం డెలివరీ, మిల్లుల ట్యాగింగ్, ట్యాబ్ ఎంట్రీ విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లుల టన్నేజీ సామర్థ్యం సాంకేతికంగా డీఎస్‌ఓ, డీఎం సివిల్ సప్లయ్ అధికారులు అధ్యాయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. మిల్లులకు పూర్తి సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయింపు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ రుక్మిణిదేవి, డీఎం సివిల్ సప్లయ్ నాగేశ్వర్‌రావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...