మొక్కల పెంపకం సమష్టి బాధ్యత


Tue,December 3, 2019 12:58 AM

-జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి
-సోషల్ ఫారెస్ట్ ఏర్పాటు హర్షణీయం
-నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నర్సింహయ్య
-గుంటిపల్లిలో ‘హరితహారం’

నిడమనూరు : పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకం సమష్టి బాధ్యత అని జడ్పీ బండా నరేందర్‌డ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గుంటిపల్లిలో ప్రభుత్వ భూమి 3.30 ఎకరాల్లో తెలంగాణకు హరితహారంలో భాగంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా బండా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. అడవులు అంతరించిపోతున్న కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.

ప్రభుత్వ భూమిలో సామాజిక అడవుల పెంపకం కోసం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. సామాజిక అడవుల పెంపకంలో భాగంగా 6రకాల మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడే లక్ష్యంతో సోషల్ ఫారెస్ట్‌ను ఏర్పాటు చేసుకోవడం హర్షదాయకమన్నారు. ప్రభుత్వ భూమిలో 17వేల మొక్కలు పెంపకం ద్వారా గ్రామంతో పాటు పరిసర గ్రామాలు స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో పాటు ఆరోగ్య రుగ్మతలకు దూరంగా ఉంటారన్నారు.

అడవులు అంతరించి పోతున్న నేపథ్యంలో సంభవిస్తున్న ఆరోగ్య రుగ్మతల నుండి బయట పడేందుకు మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా చేపట్టాలని కోరారు. కార్యక్షికమంలో జడ్పీ సీఈఓ వీర బ్రహ్మచారి, డీఆర్‌డీఓ శేఖర్‌డ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, డీఎఫ్‌ఓ శాంతారాం, మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, మం డల ప్రత్యేకాధికారి తిరుపతయ్య, తాసిల్దార్ ప్రమీల, జడ్పీటీసీ సభ్యురాలు రామేశ్వరి, ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కేవీ రామారావు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ అంకతి వెంకటరమణ, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, గుంటిపల్లి, వేంపాడు గ్రామాల సర్పంచ్‌లు పోతెపాక సంధ్యారాణి, అర్వ స్వాతి తదితరులున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...