‘పేట’ రైలుమార్గం సర్వే పనులను చేపట్టాలి


Fri,November 22, 2019 03:55 AM

-కేంద్రమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం
బొడ్రాయిబజార్‌ : ఎన్నో ఏళ్లుగా సూర్యాపేట ప్రజలు రైలుమార్గం కోసం ఎదురు చూస్తున్నారని చిట్యాల నుంచి జగయ్యపేట వరకు సూర్యాపేట మీదుగా నూతన రైలు మార్గం ఏర్పాటుకు వెంటనే సర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ కోరారు. గురువారం టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందంతో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. బీబీనగర్‌ నుంచి నడికుడి వరకు డబ్లింగ్‌ లైన్‌ వేసేందుకు పనులు చేపట్టాలని కోరారు. దామరచర్ల రైల్వేస్టేషన్‌ను వాడుకలోకి తీసుకొచ్చి అన్ని రైళ్లను స్టేషన్‌లో ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు వయా విష్ణుపురం, జాన్‌పహాడ్‌, మేళ్లచెర్వు, జగ్గయ్యపేట మీదుగా పాసింజర్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని, కాచిగూడ నుంచి విజయవాడ అమరావతి వరకు నేషనల్‌ హైవే 65వెంట హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఎక్కడైనా రైల్‌కోచ్‌ తయారీకేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్‌ల్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని ఈ సందర్భంగా ఆయన రైల్వే మంత్రిని కోరారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...