జన గణన పారదర్శకంగా చేపట్టాలి


Fri,November 22, 2019 03:55 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: స్వాతంత్య్ర అనంతరం దేశవ్యాప్తంగా 8వ సారి నిర్వహించే జనాభా గణన 2021లో జరుగనున్న నేపధ్యంలో రెవెన్యూ గ్రామాలు మున్సిపాలిటీల్లో, బ్లాక్‌ల వారిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సెన్సెస్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ ఇలంబర్తి సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి జనాభా గణన దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జరగాలంటే జనాభా గణనే ప్రాధాన్యమన్నారు. జనాభా గణనకు జిల్లాలో ఎన్యుమరేటర్లను గుర్తించి 2011జనాభా గణన ప్రాతిపదికంగా మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.

ప్రతి ఇంటి సమాచారంతోపాటు సామాజికంగా వ్యక్తుల సమాచారం తీసుకోవాలని సూచించారు. జనాభా గణనలో 150ఇళ్ల చొప్పున బ్లాక్‌ల వారిగా లెక్కించాలన్నారు. జిల్లాలు, మండలాలు గ్రామాల సరిహద్దులను డిసెంబర్‌ 31, 2018 నాటికి గుర్తించి సమాచారాన్ని సెన్సెస్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు కొత్తగా ఏర్పడిన రెవిన్యూ గ్రామాలను సీసీఎల్‌ఏ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరచాలన్నారు. ఇందుకోసం ఫారమ్‌ ఏ,బి,సీ,డీ,ఇలలో తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు ధృవీకరించి డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ప్రొపార్మా 1,2లపై సమాచారం అందించాలని, రెవెన్యూ గ్రామ, మున్సిపాలిటీ సెన్సెస్‌ రిజిష్టర్లను కలెక్టర్లు పరిశీలించాలన్నారు. జిల్లాలో మాస్టర్‌ ట్రెయినర్లను ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే శిక్షణకు పంపించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి డీఆర్‌ఓ జగదీశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి సీపీవో వెంకటేశ్వర్లు, డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్డీఓలు జగన్నాథరావు, లింగ్యానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...