ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు


Fri,November 22, 2019 03:54 AM

-అదనపు ఎస్పీ నర్మద
నల్లగొండసిటీ/హాలియా, నమస్తే తెలంగాణ: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణపై నిఘా పెట్టినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు. గురువారం ఆమె హాలియా మండల పరిధిలోని పాలెం, రామడుగు, కనగల్‌ మండల పరిధిలోని పర్వతగిరి తదితరుల ఇసుక రీచ్‌లను స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. సాండ్‌ టాక్సీ విధానం పటిష్టంగా అమలుచేయడం వల్ల ప్రభుత్వానికి కాకుండా గ్రామానికి సైతం నిధులు సమకూరుతాయన్నారు. యువకులను చైతన్యం చేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణ జరగకుండా గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు.

సాండ్‌ టాక్సీ పటిష్టంగా అమలు చేయడానికి రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. తహసీల్దార్ల సహకారంతో ప్రతి ఇసుక రీచ్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం ద్వారా నిఘా పెంచాలని, సీసీ కెమెరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సాండ్‌ టాక్సీ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఈ విధానం సమర్థంగా అమలుచేయడం ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి రెండింతల ఆదాయం సమకూర్చవచ్చన్నారు. ఆమె వెంట హాలియా సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌.ఐ వీరరాఘవులు, కనగల్‌ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, స్థానిక పోలీస్‌, రెవిన్యూ అదికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...