ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలి


Fri,November 22, 2019 03:54 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లు, సాగునీటిపారుదల ఇంజనీరింగ్‌శాఖల అధికారులతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకంతో పాటు ఉదయసముద్రం ఎత్తిపోతల, కాళేశ్వరం, ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ, ధర్మారెడ్డి కెనాల్‌, పిల్లాయిపల్లి కెనాల్‌, ఎర్ర కెనాల్‌ నిర్మాణం కోసం భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కెనాల్‌కు మొదటి దశలో 1200ఎకరాలు అవసరమైనచో ఆ భూమిని సేకరించాలని సూచించారు. భూములకు సంబంధించిన శాఖలు రికార్డులో నమోదుచేయాలని సూచించారు. అటవీభూముల విషయంలో సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ జగదీశ్వర్‌రెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...