కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి


Fri,November 22, 2019 03:54 AM

-ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌
చిట్యాల : రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని వెల్మినేడు గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మిక తనిఖీచేసి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని త్వరిగతి కాంటా వేసి మిల్లర్లకు పంపించాలని సూచించారు. అనంతరం అక్రమంగా తవ్వుతున్న రామన్నపేట- ఇపర్తి మధ్య ఉన్న రహదారిని ఆయన పరిశీలించారు. అక్రమంగా రోడ్డు తవ్విని కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసు దాఖలు చేయాలని ఆర్‌ఆండ్‌బీ ఈఈని, మిషన్‌ భగీరథ పైపులైన్‌ను 100మీటర్లు తవ్విని క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈని ఆదేశించారు. ఆయనవెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పాపారావు, ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...