జోరుగా ధాన్యం కొనుగోలు


Thu,November 21, 2019 02:17 AM

-గ్రామాల్లో కాంటాల వద్ద సందడి వాతావరణం
- రైతులు, హమాలీలు, నిర్వాహకుల్లో ఆనందం
-రోజుకు రూ.600 నుంచి 900వరకు సంపాదిస్తున్న కూలీలు
-జిల్లాలో 60ఐకేపీ, 41పీఏసీఎస్‌ సెంటర్ల ఏర్పాటు
- కనగల్‌లో అత్యధికంగా 15ఐకేపీ, 2పీఏసీఎస్‌ కేంద్రాలు
- కొనుగోలు కేంద్రాలకు భారీగా చేరుకుంటున్న ధాన్యం
కనగల్‌ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం భారీగా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆరుగాలం శ్రమించిన రైతులకు దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.1835 మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని సేకరిస్తోంది. దీంతో పల్లెలో నిరుపేద కూలీలకు, ట్రాక్ట ర్‌,లారీ ఓనర్లకు, సంఘ బంధం మహిళ సభ్యులకు సైతం ఉపాధి లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 60ఐకేపీ, 41పీఎసీఎస్‌ కేంద్రాలు ప్రారంభించింది. వీటి ద్వారా 7.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాలు అందుబాటులో లేక రైస్‌మిల్లర్లు, దళారులు అడిగిన రేటుకే ధాన్యం విక్రయించి నష్టపోయే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కూలీలకు జీవనోపాధి..
ఐకేపీ, పీఎసీఎస్‌ కేంద్రాల్లో కూలీలు నిత్యం పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రోజు రూ.600 నుంచి రూ.900వరకు సంపాదిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పండించిన పంటను మిల్లులకు తరలించడం అదనపు ఖర్చయ్యేదని నేడు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలుతో ఖర్చులు మిగిలాయని రైతులు ఆనందపడుతున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలివే..
జిల్లాలోని 31మండలాలు ఉండగా 23 మండలాల్లో ప్రభుత్వం 60ఐకేపీ, 41పీఎసీఎస్‌ కేంద్రాలను ప్రారంభించింది. జిల్లాలోనే అత్యధికంగా 1) కనగల్‌ మండలంలో 15ఐకేపీ కేంద్రాలు, 2పీఎసీఎస్‌ కేంద్రాలను ఏర్పాటుచే సింది. 2) మాడ్గులపల్లి 3ఐకేపీ, 2పీఎసీఎస్‌ సెంటర్లు. 3) తిప్పర్తి 5ఐకేపి, 1పీఎసీఎస్‌. 4) నల్లగొండ 8ఐకేపీ, 3పీఏసీఎస్‌. 5) చండూరు 1పీఏసీఎస్‌. 6) చిట్యాల 4పీఎసీఎస్‌. 7) మునుగోడు 1పీఏసీఎస్‌. 8) నార్కట్‌పల్లి 7ఐకేపి, 3పీఏసీఎస్‌. 9) కట్టంగూర్‌ 6ఐకేపీ, 3పీఏసీఎస్‌. 10) కేతేపల్లి 4ఐకేపీ, 1పీఏసీఎస్‌. 11) నకిరేకల్‌ 3ఐకేపీ, 3పీఏసీఎస్‌. 12) శాలిగౌరారం 3ఐకేపీ, 1పీఏసీఎస్‌. 13) మిర్యాలగూడెం 2పీఏసీఎస్‌. 14) నిడమనూర్‌ 1ఐకేపీ, 1పీఏసీఎస్‌. 15) త్రిపురాం 3పీఏసీఎస్‌. 16) వేములపల్లి 1ఐకేపీ, 3పీఏసీఎస్‌. 17) దామరచర్ల 1పీఏసీఎస్‌. 18) గుండ్లపల్లి 2పీఏసీఎస్‌. 19) గుర్రంపొడు 1ఐకేపీ, 1పీఏసీఎస్‌. 20) అనుముల 1పీఏసీఎస్‌. 21) పెద్దవూర 1ఐకేపీ. 22) కొండమల్లేపల్లి 1పీఏసీఎస్‌. 23) పెద్దఅడిశర్లపల్లి 1పీఏసీఎస్‌.

రైతులు పాటించాల్సిన నిబంధనలివే..
1) రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన వెంటనే పేరు నమోదు చేసుకుని టోకెన్‌ పొందాలి. 2) బ్యాంకు పాస్‌పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలను నిర్వాహకులకు అందజేయాలి. 3) వరస క్రమంలో తేమశాతం 17లోపు ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. 4) గన్నీ సంచులు రైతుల కల్లాల వద్దకు ఇవ్వరు. 5) ధాన్యం కొనుగోలు జరిగే వరకు భద్రత, ఆకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చూడాల్సిన బాధ్యత రైతులదే. 6) బస్తాకు 41కిలోలు కాంటా వేస్తారు. 7) రైతులు ఒకసారి తెచ్చిన ధాన్యాన్ని రాశిగా పోయాలి. 8) నిర్ణయించిన హమాలీ చార్జీ క్వింటాకు రూ.34మాత్రమే రైతులు చెల్లించాలి. 9) కొనుగోలు కమిటీ సభ్యులకు, హమాలీలకు అదనపు డబ్బులు, ధాన్యం ఇవ్వవద్దు. 10) సీరియల్‌, 17తేమశాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లే ముందుగా నాణ్యత ప్రమాణాలు సరిచూసుకోవాలి. ధాన్యం అరబెట్టకపోతే గింజలకు నల్లబారి రంగు మారి నాణ్యత తగ్గే అవకాశం ఉంది. నూర్పిళ్లలో రాల్లు, మట్టిపెళ్లలు, చెత్తాచెదారం వ్యర్థ్థ్ధాలు రాకుండా జాగ్రత్త వహించాలి.


65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...