అక్రమ పట్టాలతో రైతుబంధు పొందిన వారికి నోటీసులు జారీ


Thu,November 21, 2019 02:07 AM

చందంపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా అటవీ, ప్రభుత్వ భూములకు పట్టాలు పొందిన రైతులకు నోటీసులు జారీ చేసినట్లు ఏఓ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని సుమారు 92మంది రైతులు 375ఎకరాలకు దాదాపు రూ. 15లక్షలు రైతుబంధు నుంచి లబ్ధిపొందారని వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరికొంత మంది వివరాలు సేకరించి వారికి సైతం నోటీసులు అందజేయనున్నట్లు తెలిపా రు. రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు వివరాలు పంపనున్నట్లు పేర్కొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...