సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి


Thu,November 21, 2019 02:07 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లికి చెందిన రాంబాబుకు, చందంపేట మండలం ముడుదండ్ల గ్రామానికి చెందిన సుభద్రమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయన వారికి అందజేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలు, రైతులు, పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ శిరందాసు కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నాయకులు రమావత్‌ వెంకట్రాం, రమావత్‌ నర్సింహ, బొడ్డుపల్లి కృష్ణ, సత్తిరెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...