త్వరలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులు పూర్తి


Thu,November 21, 2019 02:07 AM

నార్కట్‌పల్లి : సీఎం కేసీఆర్‌ సహకారంతో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 2020 కల్లా బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆనీటితో నియోజకవర్గ ప్రజల కాళ్లు కడుగుతానని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. పంప్‌హౌజ్‌, టన్నెల్‌ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కోట్ల రూపాయలు విడతలవారీగా నిధులు మంజూరు చేస్తుండటంతో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులకు నష్ట పరిహారం కింద రూ. 30 కోట్లు ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.

మరికొంత టన్నెల్‌ పనులు 4 కిలో మీటర్లు మిగిలి ఉన్నాయని, ఆ పనులు కూడా యుద్ధ్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని.. అదే స్ఫూర్తితో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని, ఈ నెల చివరిలోగా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని, త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉందని, సీఎం కేసీఆర్‌తో ప్రాజెక్టును ప్రారంభించి నియోజకవర్గంలో పండుగ వాతావరణ తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో నియోజక వర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్‌ యానాల అశోక్‌రెడ్డి, సర్పంచ్‌లు దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, రాజు, మధు, కర్నాటి ఉపేందర్‌, గోసుల భద్రాచలం, సామ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్త య్య, చిరుమర్తి యాదయ్య, గాయం శ్యాసుందర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు వాజిద్‌, దోసపాటి విష్ణు, పసునూరి శ్రీను, బోయపల్లి శ్రీను, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, అలుగుబెల్లి సత్తిరెడ్డి, చెర్కుపల్లి రామలింగం, దుబ్బాక శ్రీధర్‌, రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...