ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌


Thu,November 21, 2019 02:07 AM

నార్కట్‌పల్లి : ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను ఇన్‌చార్జి కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ బుధవారం పరిశీలించారు. బ్రాహ్మణ వెల్లెంల వద్ద ప్రాజెక్టు సర్జిపుల్‌, పంపుహౌజ్‌ పనులు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పంప్‌హౌజ్‌ పూర్తైందని, లైనింగ్‌పనులు 90శాతం పూర్తి, సర్జిపుల్‌ లైనింగ్‌ చేయాల్సి ఉందని వివరించారు. అనంతరం ఉదయసముద్రం రిజర్వాయర్‌ ప్రాంతం, టన్నెల్‌ పనులు పరిశీలించారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు కాల్వల భూ సేకరణ 3880 ఎకరాలకు గాను, 1310 ఎకరాల పూర్తైందని, టన్నెల్‌ పనులు 10.625 కిమీలకు గాను 4 కిలో మీటర్లు లైనింగ్‌ పూర్తి చేశామని, ప్రభుత్వం నుంచి నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. టన్నెల్‌ లైనింగ్‌ పూర్తి చేసేందుకు సంవత్సర కాలం పడుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు నర్సింహ, జగదీశ్వర్‌రెడ్డి, సాయిబాబా, బుచ్చిరెడ్డి, యాధన్‌కుమార్‌, విఠలేశ్వర్‌, అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...