నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన లాంచీ ప్రయాణం


Wed,November 20, 2019 01:22 AM

నందికొండ : నాగార్జునసాగర్ హిల్‌కాలనీ లాంచీస్టేషన్ నుంచి లాంచీ ప్రయాణాలు మంగళవారం ప్రారంభమైనట్లు లాంచీస్టేషన్ మేనేజర్ హరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అగస్టు నెల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో ప్రారంభమైనప్పటి నుంచి లాంచీ ప్రయాణాలు నాగార్జునకొండకు నిలపుదల చేశామని, కృష్ణమ్మ ప్రవాహం తగ్గడంతో లాంచీ ప్రయాణాలు ప్రారంభించామన్నారు. ఆంధ్రా ప్రాంతంలో లాంచీ ప్రమాదం జరిగినప్పటి నుంచి నాగార్జునకొండకు అనుమతులు లేనందున అనుమతులు రాగానే నాగార్జునకొండకు లాంచీలను నడుపుతామని, అంతవరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో జాలీ ట్రిప్పులు కొనసాగిస్తామన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో ఉన్నందున హిల్‌కాలనీ లాంచీస్టేషన్ నుంచి శ్రీశైలంకు వారంలో ప్రతి శనివారం లాంచీలను నడుపుతామన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...