ఆర్టీసీ రథ చక్రం పరుగులు


Sun,November 17, 2019 01:09 AM

నల్లగొండ సిటీ : ఆర్టీసీ రథ చక్రం పరుగులు పెడుతోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. సమ్మె ప్రభావం రవాణపై పడకుండా మెరుగైన సేవలు అందిస్తోంది. జిల్లాలో 4డిపోల పరిధిలో వివిధప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు సైతం యధావిధిగా నడుస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రద్దీ కనుగుణంగా అధికారులు చేపట్టిన ఏర్పాట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా అన్నిరూట్లలో బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ, రవాణ, పోలీస్ శాఖ సమన్వయంతో ప్రజలకు రవాణపరంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా 282 బస్సులు నడిచాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి బస్సు డిపోల పరిధిలో సమయానుసారంగా బస్సులు నడుపుతుండటంతో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీ తలపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కార్మికులపై పడకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...