పశువుల తనిఖీకేంద్రాల ఏర్పాటుతో అక్రమాలకు చెక్


Sun,November 17, 2019 01:09 AM

దామరచర్ల : జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులతో అక్రమ దందాలకు చెక్ పడనుందని సాంద్ర గొర్రెల అభివృద్ధి సంస్థ జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి బొడ్డు విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లోని కొండ్రపోల్, నాగార్జునసాగర్ పశువుల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కేంద్రాల్లో 24మంది సిబ్బంది సిప్టుల ప్రకారం విధులను నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం సొసైటీలకు అందజేస్తున్న సబ్సిడీ జీవాలతో పాటుగా నాన్‌సబ్సిడీ జీవాలు, పాలు, గుడ్లు, పశువుల సరఫరా నమోదు చేసుకోవాలని, వీటిని సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టు వాహనాలు కూడా జీపీఎస్ సిస్టం తప్పనిసరిగా ఉండి ప్రతి వాహనం కేంద్రాల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ జీవాలు రీసైక్లింగ్ అవుతున్న క్రమంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి జియో టాగ్ ద్వారా అక్రమ రవాణను అరికట్టేందుకు నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జీపీఎస్ సిస్టంతో సబ్సిడీ జీవాల ఎగుమతి, దిగుమతులపై నిఘా ఉంటుందన్నారు. వీటితో పాటుగా మాంసం ఉత్పత్తి, పాలు, గుడ్లు అమ్మకాలు, ఉత్పత్తి వివరాలను కూడా సేకరిస్తామన్నారు. నడకన వెళ్లే వ్యాపారులు, రైతులు కూడా పశువుల తనిఖీ కేంద్రాల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నాన్‌సబ్సిడీపై అమ్మకాలు, కొనుగోలు చేసే వ్యాపారులు, రైతులు పశు తనిఖీ కేంద్రాల వద్ద నమోదుతోపాటుగా, రశీదులపై ముద్ర వేసుకున్న వాటికే మార్కెట్‌లో, సంతల్లో అమ్మకాలకు అనుమతి ఉంటుందని, నమోదు కాని వాటిని అక్రమ వ్యాపారంగా పరిగణిస్తామని తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...