ఎమ్మెల్సీ పల్లాకు కీలక పదవి


Sun,November 17, 2019 01:09 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మరో కీలక పదవి దక్కనుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పల్లాకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాజేశ్వర్‌రెడ్డి.. ఆ తర్వాత 2015 మార్చిలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా టీఆర్‌ఎస్ పక్షాన బరిలో నిలిచి విజయం సాధించారు.

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఇన్‌చార్జిగా పని చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు శాసన మండలిలో విప్‌గా కూడా పల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తొలిసారే జిల్లాకు చెందిన ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి దక్కగా.. రెండోసారి కూడా జిల్లాతో రాజకీయ అనుబంధం కలిగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దక్కనుండటం విశేషం.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...