చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా


Sun,November 17, 2019 01:09 AM

నందికొండ : ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా సరిహద్దు చెక్‌పోస్ట్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. శనివారం నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్ధు చెక్‌పోస్ట్‌ను పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1835 అందజేస్తున్నామన్నారు. నేటి వరకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న ధాన్యంను సరిహద్ధు చెక్‌పోస్ట్‌ల వద్ద నుంచి వెనక్కు పంపుతున్నామన్నారు.

అంతకు ముందు నాగార్జునసాగర్‌లో డీఆర్‌డీఏకు కేటాయించిన 100 ఎకరాల భూమిని ఆర్డీఓ జగన్నాథరావుతో కలిసి పరిశీలించారు. డీఆర్‌డీఏకు కేటాయించిన భూముల సరిహద్ధులను పరిశీలించామని త్వరలో వారికి భూమిని అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జిల్లాఫారెస్ట్ అధికారి శాంతారామ్, తాసిల్దార్ ప్రేమ్‌కుమార్, ఏడీ శ్రీనివాస్, డీఐఓ మిర్యాలగూడ బాలాజీ, ఎఫ్‌డీఓ గోపిరవి, ఎన్నెస్పీ ఈఈ యలమంద, సర్వేయర్ స్వప్న, ఎస్‌ఐ శీనయ్య, డీటీ శరత్‌చంద్ర ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...