రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం


Sun,November 17, 2019 01:08 AM

నాగారం : రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్‌లోని ఎస్సారెస్పీ 70డీబీఎం6 పిల్ల కాల్వను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కాల్వల్లో నీళ్లు రావని వదిలేసిన ఘనత గత ప్రభుత్వాలకే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో పచ్చని మాగాణిగా మారిందన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు చేరేలా కాల్వల మరమ్మతు గురించి అధికారులతో కలిసి కాల్వలను కలియతిరిగారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 320చెరువులను నింపామన్నారు. కార్యక్రమంలో కల్లెట్లపల్లి ఉప్పయ్య, గుండగాని అంబయ్య, పానుగంటి నర్సింహారెడ్డి, అనంతుల సత్తయ్య, చిప్పలపల్లి సోమయ్య, కూరం వెంకన్న, బాలమల్లు, గుంటకండ్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...