ఉత్కంఠ భరితం..


Sun,November 17, 2019 01:08 AM

నల్లగొండ స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ క్రీడను ఆదరించాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. వైఆర్‌పీ ఫౌండేషన్ సహకారంతో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాలుర పుట్‌బాల్ పోటీలు మూడోరోజు శనివారం ఉత్కంఠ భరింతంగా సాగాయి. పోటీల్లో భాగంగా నల్లగొండ, మెదక్ జిల్లా జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్‌ను డీఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు పోటీల్లో గెలుపోటములు సమానంగా తీసుకొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. క్రీడాకారులు క్రీడాప్రతిభ ప్రదర్శించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయని అన్నారు.

నువ్వా..నేనా అన్న రీతిలో జరిగిన మ్యాచ్‌లలో నల్లగొండ జట్టు మెదక్ పై 1-0తో గెలుపొందగా, వనపర్తి, నిజమాబాద్ జట్ల మధ్య మ్యాచ్ 1-1 డ్రా కాగా, రంగారెడ్డి జట్టు ఖమ్మంపై 2-1, మంచిర్యాల జట్టు వనపర్తి పై 1-0, మెదక్ జట్టు కరీంనగర్‌పై 2-0, నిజమాబాద్ జట్టు ఖమ్మంపై 1-0, నల్లగొండ జట్టు మహబూబ్‌నగర్‌పై 1-0తో విజయం సాధించాయి. పోటీలు నేడు ముగియనున్నాయి. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యామ దయాకర్, సీఐ నాగదుర్గాప్రసాద్, ఐఎంఏ అధ్యక్షులు డా.పుల్లారావు, ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్, గిరిబాబు, మందడి నర్సిరెడ్డి, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...