క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం


Fri,November 15, 2019 03:01 AM

- క్రీడాప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోరాష్ర్టానికి పేరుతేవాలి
-ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ -శాసనమండలి చైర్మన్ గుత్తా
-క్రీడాకారులను ప్రోత్సహించాలి -జడ్పీ చైర్మన్ బండా
- ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
-పాల్గొన్న 200 మంది క్రీడాకారులు

నల్లగొండ స్పోర్ట్స్ : క్రీడలను రా్రష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. క్రీడాకారులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ర్టానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ క్రీడామైదానంలో ఎలిశాల వెంకటనారాయణ స్మా రకార్థ్ధం వైఆర్‌పీ ఫౌండేషన్ సహకారంతో ఫుట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 9 జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ చేయగా, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌ల జెండాలను గుత్తా ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతం నుంచి పుట్టుకు వచ్చిన క్రీడ ఫుట్‌బాల్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, సౌత్ అమెరికా, యూరప్ వంటి దేశాలలో ఫుట్‌బాల్ క్రీడను ప్రేమిస్తారన్నారు. మన గ్రామీణ క్రీడలను ఇతర దేశాల క్రీడాకారులు యూట్యూబ్‌లో చూసి విజయాలు సాధిస్తున్నారని అన్నారు.

క్రికెట్ మోజులో పడి దేశంలో ఫుట్‌బాల్ క్రీడ అంతరించి పోయేలా చేస్తున్నామని, అంగట్లో క్రీడాకారులను కొనుగోలు చేసే క్రీడ అంటే ఒక క్రికెట్ మాత్రమే అని వెల్లడించారు. తను ఎంపీగా ఉన్న రోజుల్లో పైకా పథకంలో స్కూల్స్‌కు రూ.లక్షతో క్రీడా మైదానం ఏర్పాటు, రూ.10వేలతో క్రీడాసామగ్రి కొనుగోలు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించానన్నారు. అదేవిధంగా ఎంపీ నిధుల నుంచి ఎన్జీ కాలేజీ గ్రౌండ్ అభివృద్ధ్దికి, సీటింగ్‌వాల్‌తో పాటు కాలేజీ వరకు బీటీరోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు తన దృష్టికి తీసుకొస్తే సహకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్న వైఆర్‌పీ ఫౌండేషన్‌ను అభినందించారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలను కేవలం చదువుకే కాకుండా క్రీడల్లో రాణించే తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వంతో పాటు తెలివితేటలు వస్తాయన్నారు. క్రీడా అసోసియేషన్లు గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

వైఆర్‌పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 18 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు. అంతకు ముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యామ దయాకర్, టీఎఫ్‌ఏ ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, డీవైఎస్‌ఓ మక్బూ ల్ అహ్మద్, ధనుంజయ, ఎన్జీ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఎన్‌డీఎఫ్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు బండారు ప్ర సాద్, గిరిబాబు, గంట్ల అనంతరెడ్డి, పీఈటీలు, రంగారెడ్డి, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...