భూసార పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్


Fri,November 15, 2019 02:57 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : మిర్యాలగూడ పట్టణం ఎన్‌ఎన్నెస్పీ క్యాంపులోని భూసార పరీక్ష కేంద్రాన్ని ఇన్‌చారి కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసార పరీక్ష కేంద్రం భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.70లక్షలు మంజూరు చేసిందని, అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు సేకరించినట్లు వివరించారు. వర్షాలు సమృద్ధ్దిగా కురవడంతో రైతులు భారీగా వరి సాగు చేశారని, అంచనాకు మించి ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో 63 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, త్వరలో మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైసుమిల్లర్లు రైతులకు మద్దతు ధర అందించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ కేఎంవీ జగన్నాథరావు, తహసీల్దారు కార్తీక్, భూసార పరీక్ష కేంద్రం ఏఓ సృజన తదితరులున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...