పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు


Wed,November 13, 2019 02:47 AM

- జిల్లాలో సరిహద్దు చెక్‌పోస్టులను పరిశీలించిన ఏఎస్పీ నర్మద
- నిఘా పెంచాలని పోలీసులకు సూచన

నల్లగొండసిటీ : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో పాటు పెద్ద ఎత్తున రైతులు ధాన్యం తీసుకొస్తున్న క్రమంలో వారికి కనీస మద్దతు ధర కల్పించాలని ఏఎస్పీ నర్మద అన్నారు. పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం వాడపల్లి, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లో సరిహద్దు చెక్‌పోస్టులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని సూ చించారు. సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా పోలీస్‌ కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వాటిని అనుసంధానం చేయడం ద్వా రా పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం మన రాష్ట్రంలోకి రా కుండా చర్యలు తీసుకుంటు జిల్లాలోని రైతాంగం తీసుకొచ్చే ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తయ్యేలా చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను కచ్చితంగా అమలు చేసేలా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌ టీమ్‌లు ఏర్పాటుతో పాటు మిల్లర్ల వద్ద కొనుగోళ్లు పరిశీలిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పక్క రాష్ర్టాల నుం చి ధాన్యం అక్రమంగా మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు చెక్‌పోస్టులను పరిశీలించడం జరుగుతుందన్నారు. చెక్‌పోస్టుల వద్ద ప్రస్తుతమున్న సిబ్బందికి అదనంగా మరికొంత మందిని ఏర్పా టు చేసి 24గంటల పాటు నిఘా ఉంచామన్నారు.

రైస్‌ మిల్లుల పరిశీలన..
మిర్యాలగూడ పరిధిలోని శెట్టిపాలెం ప్రాంతంలో ఉ న్న రైస్‌ మిల్లులను సందర్శించి రైతులతో ఏఎస్పీ మాట్లాడారు. మిల్లులకు తీసుకొస్తున్న ధాన్యం సక్రమంగా కొనుగోలు చేస్తున్నారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తున్నారా లేదా అని ఆమె రైతులను అడిగి తెలుసుకున్నారు. తెస్తున్న ధాన్యంలో మాశ్చర్‌ ఎంత శాతం తీస్తున్నారో రైతులను అడిగారు. మద్దతు ధరలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పోలీస్‌ సిబ్బంది పాలొల్గొన్నారు.

మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తప్పవు
వేములపల్లి : రైతులు మిల్లులకు తరలించిన ధాన్యా న్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోళ్లు చేయకపోతే చ ర్యలు తప్పవని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. మండల పరిధిలోని శెట్టిపాలెం శివారులో గల రైస్‌ మిల్లులను సందర్శించి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌ ద్వారా అందిస్తున్న టోకెన్లను తీసుకొని వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఇబ్బందులు తలెత్తకుండ చూడాలని మిల్లర్లను ఆదేశించారు. మిల్లుల వద్ద ఏమైన సమస్యలు తలెత్తితే సమీప పోలీస్‌ స్టేషన్‌తో పాటు, మార్కెట్‌ దృష్టికి తీసుకెళ్లినట్లయితే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆమె వెంట ఎస్‌. సుధీర్‌కుమార్‌ సిబ్బంది ఉన్నారు.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
- ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌
దామరచర్ల : ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రా కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికార్లకు ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. మండలంలోని వాడపల్లి చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ క్యాంపును ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం లోడ్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ఒక్క లారీ కూడా అనుమతించకుండా చూడాలన్నారు. సీజన్‌ పూర్తి అయ్యేంతవరకు వాడపల్లి, నాగార్జునాసాగర్‌ సరిహద్దుల్లో పోలీస్‌ క్యాంపులు కొనసాగించాలన్నారు. మార్కెట్‌ కమిటీ సిబ్బంది, అధికార్లు కూడా సరిహద్దుల్లో పర్యవేక్షణ పెంచాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాధం, డీఎస్పీ వై వెంకటేశ్వర్‌రావు, వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు, క్యాంపు ఎస్‌ఐ లచ్చిరాం పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చెక్‌పోస్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ
మండలంలోని వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌చెక్‌పోస్టును జిల్లా అదనపు ఎస్పీ అనురాధ పరిశీలించారు. ఆంధ్రా నుండి ధాన్యం లారీలు రాకుండా చూడాలన్నారు. పోలీసులు షిప్టుల ప్రకారం విధులు నిర్వహించాలని ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...