తేమ శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలి


Tue,November 12, 2019 04:39 AM

-ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్
-హమాలీల చార్జి రూ.34 ఇచ్చేలా నిర్ణయం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తేమను నిశితంగా పరిశీలించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వి. చంద్రశేఖర్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పలు శాఖల అధికారులతో ఆయా పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హమాలీలకు హమాలి చార్జి కింద క్వింటాకు రూ.34ఇచ్చే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే ధరను మార్కెట్ కమిటీలు, కొనుగోలు కేంద్రాలలో అమలు చేయాలని, తూకం వేబిల్స్ అందజేయాలని సూచించారు. పలు శాఖలకు సంబంధించిన కోర్టుకేసుల విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులపై అన్ని శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిష్కరించాలని, వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, హౌసింగ్‌పీడీ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...