వైభవంగా కోటి దీపోత్సవం ప్రారంభం


Tue,November 12, 2019 04:36 AM

మిర్యాలగూడ అర్బన్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, కోటి దీపోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దీపోత్సవ కమిటీ సభ్యులు వేదమంత్రోచ్ఛరణల నడుమ శివపార్వతుల కళ్యాణం జరిపించారు. పరిసర ప్రాంత భక్తులు, మహిళలు కల్యాణాన్ని వీక్షించి దీపాలు వెలిగించారు. భక్తులు భారీగా రావడంతో మైదానం కిటకిటలాడింది. కార్యక్రమం ఈ నెల 13వ తేదీ వరకు ఉంటుందని విజయవంతం చేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు కోరారు. అనంతరం వేద వ్యాసు, పూల హరతిల కూచిపూడి నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కోటీ దీపోత్సవ కమిటీ సభ్యులు తిరునగర్ భార్గవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మి, కర్నాటి రమేశ్, బండారు కుశలయ్య, చిల్లంచర్ల విజయ్‌కుమార్, రాయపూజి భవాని, గుడిపాటి సైదులుబాబు, మల్గం రమేశ్, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...