రైతులకు సూచనలు అందించాలి


Tue,November 12, 2019 04:36 AM

-జిల్లా వ్యవసాయ అధికారి సుజాత
నీలగిరి: ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సూచనలు, సలహాలను రైతాంగానికి ఎప్పటికప్పుడు అందజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి టి. సుజాత సూచించారు. సోమవారం జేడీఏ కార్యాలయంలో డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆధునిక పరిజ్ఞానం కోసం చేస్తున్న కృషి సరిపోవడం లేదని దీన్ని విస్తరించేందుకు డీలర్లు, యజమానులు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు డీలర్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానం రైతులకు అందించుటకు, ఉపకరణాల డీలర్లకు, వ్యవసాయ ఉపకరణాల నాణ్యత పరిరక్షణలో చట్టపరమైన అవగాహన పెంపొందించుటకు, వ్యాపార దక్షతకు పెంపొందించుటకు కేంద్ర ప్రభుత్వం ఒక డిప్లమో కోర్సును రూపకల్పన చేసిందన్నారు. ఉపకరణాల డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. క్లాస్‌రూమ్‌లు పాఠాలు, ప్రయోగశాలలు, పరిశోధన స్థానాలు క్షేత్ర సందర్శన ద్వారా అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తామని తెలిపారు. కోర్సు పూర్తిచేసిన డీలర్లకు డిప్లమో సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ సుదర్శిని, అధికారులు నూతన్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఏకోనారాయణ, డీఐ రాజు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...