కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ నింపుతాం ..


Sun,November 10, 2019 01:24 AM

-ఇక రెండు పంటలకు నీళ్లు
-విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
-ఎస్సారెస్పీ డీబీఎం-71 కాల్వలను పరిశీలించిన మంత్రి

అర్వపల్లి : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు మళ్లించిన గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలను నింపుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం-71 కాలువలపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి మంత్రి పర్యటించారు. రైతులతో మాట్లాడారు. తిమ్మాపురం గ్రామశివారులోని ఎడ్లవారికుంటకు గోదావరి జలాలు రావడంలేదని వైస్‌ఎంపీపీ మారిపెద్ది భవానీ, రైతులు మంత్రికి విన్నవించగా వెంటనే ఫోన్ ద్వారా ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, జిల్లాలోని ప్రతి చెరువు, కుంటను కాళేశ్వరం జలాలతో నింపితీరుతామని స్పష్టం చేశారు. రైతులు ఎస్సారెస్పీ అధికారులకు సహకరించి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ రెండోదశ కాలువల ద్వారా జిల్లాలో రెండు పంటలకు గోదావరి జలాలను పంపిణీ చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎస్సారెస్పీ రెండోదశ కాలువలకు కాళేశ్వరం జలాలు వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాలువలకు గోదావరి జలాలను తీసుకురావడం పట్ల రైతులు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, రైతులు తండ లింగమూర్తి, సత్యనారాయణ, అవిలయ్య, తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...