గంజాయిని తరిమేద్దాం..


Sun,November 10, 2019 01:22 AM

నార్కట్‌పల్లి : యువతను చిత్తు చేస్తున్న గంజాయిని తరిమేద్దామని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నా రు. శనివారం మండల పరిధిలోని పల్లెపహాడ్ గ్రామం లో పోలీస్‌శాఖ ఆ ధ్వర్యంలో గంజా యి వాడకంతో జరిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గంజాయి మత్తుకు యువత బానిసలుగా మారి భవిష్యత్‌ను కోల్పోతున్నారన్నారు. గంజాయి రహిత గ్రామంగా పల్లెపహాడ్‌కు పేరుతేవాలని ఆకాంక్షించారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ గంజాయి వ్యాపారం జరుగకుండా పోలీసు శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరిస్తే మంచి సత్ఫలితాలు సాధిస్తామన్నారు. గంజాయి వ్యాపారం ఎక్కడ జరిగినా పోలీసులకు బాధ్యత పౌరులు సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచి నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా, విక్రయాలను అడ్డుకుంటామని వెల్లడించారు. అనంతరం ఐజే యూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి వ్యాపారం గ్రామంలో నిర్మూలించాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్మెకొను రమేశ్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మమ్మ, పజ్జూరి నర్సిరెడ్డి, బద్దం రామిరెడ్డి, ఎడమ శేఖర్‌రెడ్డి, సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ దాచెపల్లి విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles