ప్రజలకు సత్వరన్యాయం


Sun,November 10, 2019 01:22 AM

రామగిరి : జాతీయ న్యాయ సేవా పథకంతో న్యాయసేవ సంస్థ ప్రజలకు సత్వరం సేవలందిస్తుందని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ్ధ ఇన్‌చార్జి కార్యదర్శి, సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్‌రావు అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవంను పురస్కరించుకొని శనివారం న్యాయసేవా సంస్థ ద్వారా నిర్వహించిన అవగాహన ర్యాలీని ఉదయం కోర్టు ఆవరణలో జెండాఊపి ప్రారంభించారు. కోర్టునుంచి గడియారం సెంటర్ వరకు సాగింది. విద్యార్థుల వేషధారణలు ఆలరించాయి. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సంస్థలో నిర్వహించిన జాతీయ న్యాయ సేవల దినోత్సవం సదస్సును ఆయన డీఈఓ బి.భిక్షపతితో కలిసి ఫ్రారంభించి మాట్లాడారు. న్యాయ సేవలు ప్రజలకు చేరవేసి న్యాయ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ విద్యార్థ్ధులకు విద్యతోపాటు వారిలోని సృజనాత్మకను వెలికితీసే క్రమంలో న్యాయ సేవాసంస్థతో విజ్ఞాన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడంతో విద్యార్థులో ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. అనంతరం ఎంఏ ఖలీం నిర్మించిన షార్ట్ ఫిలీంను ప్రదర్శించడం తో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో పలువురు న్యా యమూర్తులు, న్యాయవాదులు, ప్యానల్‌న్యాయవాదులు, పారలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...