యథావిధిగా ఆర్టీసీ బస్సులు


Sun,November 10, 2019 01:22 AM

నల్లగొండసిటీ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 35వ రోజుకు చేరినా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు సాఫీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల అవసరాల కనుగుణంగా బస్సులు నడుపుతుండడంతో సంఖ్య రోజురోజుకు ఆర్టీసీలో రద్దీ పెరుగుతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 4డిపోల్లో 90శాతం బస్సులు రోడ్డెక్కాయి. మొత్తం 280 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో వేకువ జాము నుంచే అధికారులు బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు సజావుగా వెళ్తుతున్నారు. టిమ్స్ ద్వారా టికెట్లు జారీ చేస్తుండటంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నామని ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...