ఆర్మీ రిటైర్డు జవాన్‌కు సన్మానం


Sat,November 9, 2019 04:58 AM

కలెక్టరేట్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఆర్మీ రిటైర్డు జవాన్ మేకల విజయ్‌కుమార్ యాదవ్‌ను శుక్రవారం గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విజయ్‌కుమార్ 17 ఏళ్ల పాటు ఆర్మీలో పని చేస్తూ దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా, ఆయనను గ్రామంలో సర్పంచ్ గాండ్ల మల్లేశం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయ్‌కుమార్‌ను ఆర్మీ ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహించి కొంతకాలం క్రితం మృతి చెందిన ఆయన తండ్రి మేకల పోచం మంచితనాన్ని నెమరువేసుకుంటూ ఆర్మీలో దేశ సేవ చేసి వచ్చిన విజయ్‌కుమార్ బ్రాహ్మణపల్లికి చెందిన వాడు తమకు గర్వంగా ఉందని గ్రామస్తులు కొనియాడారు.

కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం పోరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పుప్పాల నిర్మల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓదెల రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మంగతో పాటు విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...