విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి


Fri,November 8, 2019 03:46 AM

-గురుకులాల రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి
దేవరకొండ, నమస్తేతెలంగాణ : విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సైన్స్‌ఫెయిర్ దోహద పడుతుందని, ఆదిశగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని గురుకుల పాఠశాలల డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం కొండభీమనపల్లి సమీపంలో ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రీజినల్ సైన్స్‌ఫెయిర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో చేసే ప్రయోగాల ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. రాష్ట్రంలో 183 ఎస్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు నడుస్తున్నాయన్నారు. వీటిలో పేద విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ స్థాయిలోని 11 గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్సీవో సుధాకర్, ఏఆర్సీ ప్రిన్సిపాల్స్ ఎస్‌కె సైదులు, జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...