సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి


Thu,November 7, 2019 01:08 AM

నల్లగొండ సిటీ : సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఏఎస్పీ నర్మద సూచించారు. బుధవారం ఎన్జీ కళాశాలలో కళాశాల మహిళా సాధికారత విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్, షీటీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగం అలవాటుగా మారిందని, వీటిలో అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు. సోషల్ మీడియాలో నిర్ధారణ లేని పోస్టుల ద్వారా అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ఫేస్‌బుక్ పోస్టులకు లైకులు రాకపోతే నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, పాశ్చాత్య సంసృ్కతి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఖాతాలు పెరిగిపోయాయని వీటిపై జాగ్రత్త ఉండాలని, భవిష్యత్‌లో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.

మహిళలు, యువతులు, విద్యార్థినులకు రక్షణే షీటీమ్స్ ధ్యేయమని తెలిపారు. అనంతరం షీటీమ్స్ సీఐ రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సదస్సులో పోలీస్ కళా బృందం కళాకారులు షీటీమ్స్ ఆవశ్యకత-తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఆలపించిన పాటలు అలరించాయి. ఎన్జీ కాలేజీ మహిళా సాధికారత విభాగం బాధ్యులు డా.ఎన్. దీపిక అధ్యక్షతన జరిగిన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ కె. చంద్రశేఖర్‌కృష్ణ , అకాడమిక్ కోఆర్డినేటర్ మున్నీర్, తెలుగు శాఖ అధిపతి డా.కృష్ణకౌండిన్య, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, అధ్యాపకులు నాగుల వేణు, గ్రంథాలయ శాస్త్ర విభాగ అధిపతి డా.ఎన్. దుర్గాప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు నర్సింహ, యాదగిరిరెడ్డి, సంధ్య, అధ్యాపకులు దుర్గాప్రసాద్, షీటీమ్ సిబ్బంది ఏఎస్‌ఐ విజయలక్ష్మి, సోమిరెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నర్సింహ, సైదులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...