రుణాలు మంజూరు చేయాలి


Thu,November 7, 2019 01:08 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధులు మెరుగు పరిచేందుకు రుణాలు మంజూరు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకర్లు ఉదార స్వభావంతో పని చేసి మహిళలను ప్రోత్సహించడంతో పాటు ఆయా శాఖల వారీగా వచ్చే సబ్సిడీ రుణాలు సైతం ఎక్కువ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. విద్యారుణాలు, వ్యక్తిగత అభివృద్ధ్ది, ఆర్థ్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని వాటి విషయంలో ఆలస్యం చేయవద్దని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 2016-17, 2017-18 ఆర్థ్ధిక సంవత్సరంలో 2662 యూనిట్లకు గాను 753 గ్రౌండింగ్ చేశారని పెండింగ్‌యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని సూచించారు. గ్రౌండింగ్ మేళాలు 15 రోజుల్లో తేదీలు నిర్ణయించి కంట్రోలింగ్ అధికారులకు తెలియజేస్తారని బ్యాంకర్లంతా సబ్సిడీ, జమ అయిన లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తి చేసి గ్రౌండింగ్ మేళాలో పంపిణీ చేయాలని కోరారు.

అదే విధంగా గ్రౌండింగ్ చేసిన యూనిట్ల ఫొటోలు, వినియోగిత పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. 2018-19 ఆర్థ్ధిక సంవత్సరానికి బ్యాంకర్లు అంగీకరించిన ప్రతిపాదనలు పంపాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వ్యవసాయ పంట రుణాలు మంజూరు చేసే సమయంలో ఇన్సూరెన్స్ కింద మినహాయించిన వివరాలను అందజేయాలని బ్యాంకర్లను కోరారు. ఆర్‌బీఐ సూచన ప్రకారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రతి నెలా మూడో వారంలో ఫిర్యాదుల పరిష్కారానికి సమావేశాలు నిర్వహించాలని ఆర్‌బీఐ ఏజీఎం శ్రీధర్ సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి నారాయణస్వామి, మైనార్టీ డీడీ వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం సూర్యం, ఏడీఏ హుస్సేన్‌బాబు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...