పకడ్బందీగా ఆర్టీసీ సేవలు


Wed,November 6, 2019 02:07 AM

నల్లగొండసిటీ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణం గా కార్మికులు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పట్టణాలతో పాటు పల్లెలకు బస్‌లు యథావిధిగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందు లు లేకుండా బస్‌లు నడుస్తుండడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 271బస్‌లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. తా త్కాలిక కండక్టర్‌, ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు చొరు వతో జిల్లాలోని నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి డిపోల పరిధిలో బస్‌లు పకడ్బందీగా నడుస్తున్నాయి. అన్ని రూట్లలో ప్రయాణికులకు అనుగుణంగా బస్‌లు నడుపుతున్నారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ జిల్లాలో బస్‌లు యథావిధిగా నడుస్తుండడంతో ప్రయాణికులపై బంద్‌ ప్రభావం లేదు. ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల బందోబస్తు కొనసాగుతూనే ఉంది.

బస్టాండ్‌ పరిశీలించిన ఎస్పీ...
ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు విధుల్లో చేరాలనుకునే వారికి యూనియన్‌ నాయకుల నుంచి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొనడంతో ఎస్పీ రంగనాథ్‌ బస్టాండ్‌ను సందర్శించి పోలీసులను భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విధుల్లో చేరబోయే వారికి ఎవరైనా బెదిరింపులకు గు రిచేస్తే వారిపై చట్టరీత్యా చ ర్యలు తీసుకోవాలన్నారు.

విధుల్లో చేరే వారికి పూర్తి భద్రత కల్పిస్తాం : ఎస్పీ
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం ఇచ్చిన అవకాశం మేర కు విధుల్లో చేరే ఉద్యోగుల కు పూర్తి రక్షణ కల్పిస్తామని ఎస్పీ రంగనాథ్‌ అన్నారు. జిల్లాలోని నల్లగొండ బస్టాండ్‌తో పాటు మిర్యాలగూడ తదితర బస్టాండ్ల వద్ద పోలీస్‌ బందోబస్తును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ విధుల్లో చేరే ఉద్యోగులు నిర్భయంగా పోలీసులను, ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించి విధుల్లో చేరే లేఖలు ఇవ్వాలని సూచించారు. విధులు చేసే ఉద్యోగులకు భద్రత కల్పించడంలో వారికి రక్షణగా ఉంటామన్నారు. ఆయన వెంట పోలీస్‌, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...