నేటి నుంచి గురుకుల వైజ్ఞానిక ప్రదర్శన


Tue,November 5, 2019 01:02 AM

-సాంఘీక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహణ
-228 మంది విద్యార్థులు.. 114 ప్రదర్శనలు
-7 జిల్లాల నుంచి తరలిరానున్న విద్యార్థులు
-ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీలో రెండు రోజులపాటు నిర్వహణ

నల్లగొండ, నమస్తే తెలంగాణ: పిల్లల మేథస్సుకు పరీక్ష పెడుతూ సైన్స్‌లో నూతన పరిజ్ఞానాన్ని కనబరుస్తూ ప్రదర్శనలు చేపట్టేందుకు విద్యార్థులచే సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం ఏర్పాట్లు చేస్తోంది. నేడు, రేపు 7జిల్లాలకు సంబంధించిన గురుకుల విద్యాసంస్థల విద్యార్థులచే జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ (నిడమనూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల)లో ఈ వైజ్ఞానికి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 228 మంది విద్యార్థినులచే 114 ప్రదర్శనలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆర్‌సీఓ అరుణకుమారి సోమవారం ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీలో పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం జిల్లాల నుంచి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్‌లో భాగస్వాములవుతున్నట్లు తెలిపారు.

మొత్తం 228 మంది విద్యార్థులు 114 ప్రదర్శనలు చేయనున్నట్లు తెలిపారు. రెండ్రోజుల పాటు ఈ వైజ్ఞానికి ప్రదర్శన నిర్వహిస్తున్నందున విద్యార్థులంతా వినియోగించుకొని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఫిజికల్ సైన్స్‌తో పాటు బయోసైన్స్, ఈవీఎస్, మేథమెటిక్స్, కంప్యూటర్, హ్యూమానిటీస్ విభాగాల్లో ఈ ప్రదర్శనలు ఉండనున్నట్లు తెలిపారు. సాగర్‌రోడ్డులోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీలో ఈసైన్స్ ఫెయిర్ నిర్వహించనుండగా, దీన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం వైజ్ఞానికి ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీసీఓ ఖుర్షీద్, నిడమనూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.అరుణ, పుండరికాచారి, తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...