క్రైం రికార్డులు కంప్యూటర్‌లో పదిలం


Tue,November 5, 2019 01:00 AM

నల్లగొండసిటీ: సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిల్లో వినియోగించుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన రీతిలో సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్‌బీ విభాగంలో డేటా సెంటర్‌ను ఆయన ఏఎస్పీ నర్మదతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో డీసీఆర్‌బీ కీలకమైన విభాగం జిల్లా వ్యాప్తంగా జరిగే నేరాలు, వాటి సమగ్ర వివరాలతోపాటు రోజువారి నేర నివేదిక, క్రైం ఫైల్స్ లాంటివి డీసీఆర్‌బీతో మిళితమై ఉంటాయన్నారు. గతంలో ఏ రికార్డు కావాలన్న ఏ ఫైల్ అవసరమైన సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి వివరాలు తీసుకుని సమర్పించే పరిస్థితి ఉండేదన్నారు.

కాని ప్రస్తుత డీసీఆర్‌బీ కానిస్టేబుల్ రవికుమార్ రూపొందించిన డాట్ నెట్ ప్రోగ్రామ్‌లో రూపొందించిన సాఫ్ట్‌వేర్లలో అన్ని వివరాలు ఒకే చోట లభించే అవకాశం ఉందన్నారు. ఈ సాప్టువేర్‌ను అన్ని పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో అమలులో ఉన్న సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేయడం ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే అన్ని నేరాలు, వాటిసమగ్ర వివరాలు, నేరస్తులు రికార్డులన్ని ఆన్‌లైన్ ద్వారా నేరుగా డీసీఆర్‌బీ విభాగానికి చేరే విధంగా కృషిచేస్తామన్నారు. ఈ సాప్టువేర్‌ను రూపొందించిన కానిస్టేబుల్ రవికుమార్‌ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ రవికుమార్, సీఐ అంజయ్య, డీపీఓ నాగరాజన్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్రగౌడ్, యూనియన్ నాయకులు సోమయ్య, సతీష్, పరమేష్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...