ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తాం : ఎస్పీ


Tue,November 5, 2019 01:00 AM

నల్లగొండక్రైం: పోలీసుల దృష్టికి వచ్చే ప్రతి ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని ఎస్పీ రంగనాథ్ అన్నారు. సోమవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్‌డే ద్వారా ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు, ఆర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రతి దరఖాస్తుదారునికి సమస్య పరిష్కారం అయిందో లేదో తెలుసుకుంటున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్ల పరిధిలోపోలీస్ అధికారులతో గ్రీవెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం సంబందిత పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫోన్‌లో ఆదేశించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles