విధుల్లో చేరేందుకు ఆర్టీసీ సిబ్బంది ఆసక్తి


Mon,November 4, 2019 02:03 AM

నల్లగొండ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అమ్మ పెట్టదు.. అడుక్క తిననీయదు.. అన్నట్లు ఆర్టీసీలో కార్మికుల నాయకుల దందా కొనసాగుతోంది. అమాయక కార్మికులను రెచ్చగొట్టి నిరసనలు, ధర్నాలు చేస్తూ పేరుతో వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. 30రోజులుగా కార్మికులను విధులకు వెళ్లకుండా అడ్డుకొని డిపోల వద్ద పెత్తనాన్ని చెలాయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులను 3రోజుల్లో విధుల్లో చేరాలని కార్మికులు రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. దీంతో కొంతమంది డ్రైవర్లు విధుల్లోకి వెళ్తుండగా యూనియన్ నాయకులు తమ పెత్తనం చెలాయిస్తూ విధుల్లోకి వెళ్తున్న డ్రైవర్లను అడ్డుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ఆదివారం విధుల్లోకి వెళ్ళేందుకు నల్లగొండ డిపోకు చెందిన డ్రైవర్, మిర్యాలగూడ డిపోకు చెందిన మరో కార్మికుడు వెళ్తుండగా కార్మిక నాయకులు వారి విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్మికులకు విధులు నిర్వహించాలని ఉన్నప్పటికీ యూనియన్ నాయకులు బెదిరింపుల వల్ల విధులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని కార్మికులు మదన పడుతున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...