టీఆర్టీ ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు విడుదల


Sun,November 3, 2019 04:12 AM

-ఉమ్మడి జిల్లాలో భర్తీకానున్న 35 పోస్టులు
నల్లగొండ విద్యావిభాగం : టీఆర్‌టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు) ఎస్‌జీటీ -ఇంగ్లిష్ మీడియం ఫలితాలను శనివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ విభాగంలో 35 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ వెల్లడించిన విషయం విధితమే. 2017లో విడుదలచేసిన నోటిపికేషన్ ప్రకారం టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ఫలితాలను ఏప్రిల్‌లో వెల్లడించగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై వారి వివరాలు ప్రకటించింది. దీంతో అభ్యర్థుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రెండు, మూడురోజుల్లో ఎంపికైనవారి వివరాలు...!
ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలు రెండు, మూడురోజుల్లో జిల్లా విద్యాశాఖకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత టీఎస్‌పీఎస్‌సీ సూచించిన షెడ్యూల్ మేరకు జిల్లాలో నియమకాల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇంకా పూర్తిస్థాయి సమచారం తెలియాల్సి ఉంది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...