మానవ నిర్మిత అద్భుత కట్టడం నాగార్జునసాగర్ ప్రాజెక్టు


Sun,November 3, 2019 04:12 AM

-హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్
నందికొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుత కట్టడమని హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్ అన్నారు. నాగార్జునసాగర్ డ్యాం, బుద్ధవనంను శనివారం ఆయన సందర్శించారు. నాగార్జునసాగర్ డ్యాంపై క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల, గ్యాలరీలో ఏర్పాటుచేసిన డ్యాం నమూనాలను సందర్శించారు. అనంతరం హిల్‌కాలనీలోని బుద్ధవనంలో బుద్ధుడి జీవితగాధను తెలిపే శిల్పాలను, మ్యూజియం, ఎత్తైన బుద్ధుని విగ్రహం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిల్‌కాలనీ బుద్ధవనంలో శిల్పాలు, మ్యూజియం, విగ్రహం ఏర్పాట్లు బాగున్నాయన్నారు. అంతకుముందు నాగార్జునసాగర్ విజయవిహార్ చేరుకున్న వీరికి నిడమనూరు కోర్టు న్యాయమూర్తి పురుషోత్తంరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వీరితో విజయపూరి టౌన్ ఎస్‌ఐ శీనయ్య, టూరిజం గైడ్ సత్యనారాయణ, కోర్టు సిబ్బంది కాలీక్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...