హెచ్‌ఎం మంగళ సస్పెన్షన్..


Sun,November 3, 2019 04:12 AM

నల్లగొండ విద్యావిభాగం : జిల్లాలోని వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్‌మాస్టార్‌గా పనిచేస్తున్న మంగళను సప్పెండ్ చేస్తు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జెడీ విజయలక్ష్మీబాయి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా మంగళ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తు ఆమె పదవీకాలంపూర్తి కావడంతో విద్యాశాఖ డైరెక్టర్ సంతకం ఫోర్జరీతో ధ్రువపత్రాన్ని సృష్టించి డీఈఓ సమర్పించిన విషయం విధితమే. ఆ విషయమై నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నత అధికారుల ఆదేశాలతో అప్పటీ డీఈఓ సరోజనీదేవి ఫిర్యాదు చేసింది. ఓపెన్ స్కూల్ బాధ్యతలను నుంచి ఆమెను తొలగించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరుపడంతోపాటు వాస్తవాలు వెల్లడి కావడంతోనే ఆమెను ఉపాధ్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...