యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Sun,November 3, 2019 04:12 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. కార్తీకకోలాహలం నెలకొంది. వ్రతపూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనాలలో 2 గంటలు, ప్రత్యేక దర్శనాలలో గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణ తంతును జరిపారు. కళ్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కళ్యాణం నిర్వహించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...