రెండు గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల


Sun,November 3, 2019 04:11 AM

నందికొండ : నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 590అడుగులకు గాను 589.80అడుగులకు చేరుకొని 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 29946 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5156, కుడికాల్వ ద్వారా 9217, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, డీటీ గేట్సు(డైవర్షన్ టన్నల్) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 మొత్తం 79396క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 79396 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 883.80 అడుగుల వద్ద 218.7210 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 81563 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

మూసీకి తగ్గుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం సాయంత్రం వరకు 850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 638.35(2.85 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా, కుడి, ఎడమ కాలువలకు ఎటువంటి ఔట్‌ఫ్లో వెళ్లడం లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉంది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles