పేదలకు అండగా సీఎం సహాయనిధి


Sat,November 2, 2019 01:04 AM

నల్లగొండ రూరల్: సమస్యలతో బాధపడుతున్న పేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ నిలుస్తుందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి నియోజకవర్గంలోని 149మందికి మంజూరైన ఎల్‌ఓసీ, సీఎంఆర్‌ఎఫ్ రూ.62,24,500 నిధుల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బండా మాట్లాడుతూ పేదలు వివిధ సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకుని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు ఇవ్వనంత సీఎం సహాయనిధి నిధులను సీఎం కేసీఆర్ ఇస్తూ పేదలకు ఆసరా అవుతున్నారన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు రూ.3,01,84,900 బాధితులకు అందజేశామని, ఇంకా 417దరఖాస్తులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సీఎం సహాయ నిధి కింద రాష్ట్రంలో అత్యధిక నిధులు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకే కేటాయించారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, జిల్లా నాయకులు నీరంజన్‌వలీ, కొండూరు సత్యనారాయణ, మందడి సైదిరెడ్డి, రవీందర్‌రావు, నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, అయితగోని యాదయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, రామగిరి శ్రీధర్ రావు, వంగాల సహాదేవ్ రెడ్డి, ఎస్. మోయిజ్, దైద రజిత పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...