షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం


Sat,November 2, 2019 01:04 AM

మాడ్గులపల్లి : షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమైన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీను తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి శ్రీనుకు సమాచారం అందజేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. డబ్బులు, ధాన్యం, బట్టలు, వస్తువులు కాలిపోయాయని, సుమారు రూ.2లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. కూతురు పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బులు కాలిపోవడంతో శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.
గృహోపకరణాలు దగ్ధం
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లో గురువారం రాత్రి షార్ట్ సర్యూట్ జరిగి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీకాలనీకి చెందిన బిజిలి భాగ్యమ్మ గురువారం రాత్రి తన కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నది. అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన భాగ్యమ్మ భయంతో కుమారుడిని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. టీ.వీ, బెడ్, వస్తువులు, దుస్తులు దగ్ధమయ్యాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...