ఉత్తమ్, రేవంత్ తోడుదొంగలు


Sun,October 20, 2019 04:22 AM

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ : టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డిలు తోడు దొంగలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్ష ల తో పట్టుబడ్డ దొంగ రేవంత్‌రెడ్డిని, 2014 ఎన్నికల సమయంలో తరలిస్తున్న రూ. 3 కోట్ల డబ్బును కారులో తగులబెట్టుకున్న మరో దొంగ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అడ్డంగా దొరికిన ఇద్దరు దొం గలు ఇక్కడకు వచ్చి మాట్లాడుతుంటే హుజూర్‌నగర్ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అనేక కుంభకోణాలు చేసి జైళ్లకు వెళ్లినది చరిత్ర కాంగ్రెస్ నాయకులేనన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి దుర్మార్గుడు, కబ్జాకోరు అని అంటున్నారని అతనికి ఏ అధికారం ఉండి కబ్జా, అక్రమాలకు పాల్పడ్డాడన్నారు. దుర్మార్గాలు చేసింది మీరు. మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో రౌడీలను పెంచి పోషించింది ఎవరు, రౌడీలు ఎవరి వెంట ఉన్నారో అక్క డ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ కింద ముంపు ప్రాంతాలను వదిలి మునగని పీక్లానాయక్ తండాలాంటి గ్రామాలను చేర్చి డబ్బులను అనుమాయులకు కట్టబెట్టిన చరిత్ర ఉత్తమ్‌దేనన్నారు. పులిచింతల్లో మునిగిపోతున్న రాంచంద్రాపురం తండా, మట్టపల్లిలోని రైతులకు ప్యాకేజీలను ఇవ్వకుండా ఇబ్బందులను పెట్టిన చరిత్ర నీదేనన్నారు. అమాయక రైతులు, ప్రజలను, ఇతర పార్టీ కార్యకర్తల మీద కేసులను పెట్టి జైళ్లకు పంపిన చరిత్రను ప్రజలెవ్వరూ మర్చిపోలేదన్నారు. బీజేపీతో కలిసి ఎలక్షన్ కమిషన్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసి చిరువ్యాపారులపై, రైస్‌మిల్లులపై ఐటీ అధికారులతో దాడులను చేయించినా ఎక్క డా ఒక్క రూపాయి కూడా దొరకలేదన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉప ఎన్నికలో తమదే గెలుపని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఓపిక పడుతున్నారన్నారు. పద్మావతికి టికెట్ వద్దన్న వారు, కుటుంబపాలన చేస్తున్నారని విమర్శించిన వారిని ఇక్కడకు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తుంటేనే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కోదాడలో పనిచేయకుంటే వెళ్లగొట్టారని, అక్కడ వెళ్లగొట్టిన ఆమెను ఇక్కడి ప్రజలు ఎలా గెలిపిస్తారన్నారు. రెండు సా ర్లు మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేసావని, మరోసారి హుజూర్‌నగర్ ప్రజలు నీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉత్తమ్ కు ంబానికి లాభమని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే నియోజకవర్గానికి లాభమన్నారు.

కోదాడలో వెళ్లగొడితే ఇక్కడికొచ్చారు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కోదాడలో నియోజకవర్గాన్ని పద్మావతి అభివృద్ది చేయకపోవడంతో ఓడించారని ఇప్పుడు ఇక్కడ అభివృద్ధ్ది చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. హుజూర్‌నగర్ ప్రజలు అభివృద్ధ్దిని కోరుకుంటున్నారని, స్థానికుడైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నిర్ణయానికి వచ్చి సైదిరెడ్డిని ఎలాగైనా గెలిపించాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వైశ్య, చిరు వ్యాపారుల మీద ఐటీ దాడులను చేస్తున్నారన్నారు. వ్యాపారులు ఉత్తమ్‌కు ఓటు వేయరన్న భయంతోనే ఈ దాడులకు పురి కొల్పుతున్నాడన్నారు. టీఆర్‌ఎస్ వారికి అండగా ఉంటుందన్నా రు. ఈ ఎన్నిక తర్వాత ఉత్తమ్ పీసీసీ పదవి ఊడిపోతుందని దాని కోసం రేవంత్, కోమటిరెడ్డిలు కోట్లాడుతున్నారన్నారు. స్థానికుడు, విద్యాధికుడైన, సౌమ్యుడైన సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలు చూస్తున్నారన్నారు.

పుట్టిన గడ్డకు మేలు చేయాలనే వచ్చా : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి
పుట్టిన గడ్డకు మేలు చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని గత ఎన్నికల్లో ఓడిపోయినా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేశానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జగదీష్‌రెడ్డిలతో మాట్లాడి నియోజకవర్గానికి రూ. 100 కోట్ల ఫండ్‌ను తీసుకుని వ చ్చి పలు అభివృద్ధ్ది కార్యక్రమాలను చేపట్టానన్నారు. ప్రతీ తండాలో, గ్రామాల్లో ప్రజల సమస్య లు నాకు తెలుసునని తనను గెలిపిస్తే వారి సమస్యలన్నింటినీ తీర్చుతానన్నారు. ఉత్తమ్ తనను అరాచకుడని అంటున్నాడని, విజయమ్మకు నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకున్నది ఎవరని, వైఎస్సార్ విగ్రహాలను తగుల బెట్టి అరాచకాలు సృష్టించింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో సర్కార్ తుమ్మలు మొలిచిన పొలాలు ఎవరివో అందరికీ తెలుసునన్నారు. ఇతర దేశాల పౌరసత్వాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, ప్రజలకు మేలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటానన్నారు. నీవు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా అభివృద్ధ్దిలో పోటీ పడదామన్నారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, శానసమండలి విప్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...