ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది


Sun,October 20, 2019 04:20 AM

హుజూర్‌నగర్‌రూరల్ : టీపీసీసీసీ అధ్యక్షుడు ఉత్త మ్ కుమార్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఉప ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ నాయకుడు రామిరెడ్డి అనుచరులు, 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ చేరారు. వారికి ఎమ్మెల్సీ పల్లా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించి సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు. ఉత్తమ్ ఆహంకారంతోనే ఆ పార్టీ నాయకులు ఒక్కోక్కరుగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...