సాహిత్యరంగంలో నర్సింహారెడ్డి కృషి విశేషం


Sun,October 20, 2019 04:20 AM

-సమాహార పుస్తకావిష్కరణలో డీఈఓ పి.సరోజనీదేవి
రామగిరి: సాహిత్యరంగంలో డాక్టర్ ఏనుగు నర్సింహ్మరెడ్డి కృషి విశేషమైందని డీఈఓ పి.సరోజనీదేవి తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి రచించిన విమర్శ వ్యాసాల గ్రంథం సమాహార పుస్తకావిష్కరణ శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించారు. దీనికి విశిష్టఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కళాలు, కళాకారులకు, రచయితలకు పుట్టినిళ్ళు నల్లగొండ అన్నారు. అయితే ఎంతో మంది రచయితల వ్యాసాలను ఒక్కచోట చేర్చి సమాహారంతో వెలుగులోకి తెవడం హర్షనీయమన్నారు. పుస్తకావిష్కరణ కర్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల భాషలో మర్ని కథాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. యువతరాన్ని అటువైపుగా రాణించే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా రచయితలు మేరెడ్డి యాదగిరిరెడ్డి, మునాస్ వెంకట్, డాక్టర్ పగాల నాగేందర్ తదితరులు సమహారంపై మాట్లాడారు. సభాధ్యక్షులుగా డాక్టర్ బెల్లి యాదయ్య వ్యహరించగా కవులు, రచయితలు డాక్టర్ కోయి కోటేశ్వర్‌రావు, గుడిపాటి, పెరుమళ్ళ ఆనంద్, తండు కృష్ణకౌండిన్య, కృతిస్వీకర్త పాటి మోహన్‌రెడ్డి, సృజన సాహితీ సంస్థ నిర్వహకులు సాగర్ల సత్తయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, తెలుగు పరిశోధన విద్యార్ధి నర్రా ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...