వదలని వాన..


Sat,October 19, 2019 02:28 AM

-జిల్లాలోని పలు మండలాల్లో వర్షం
నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా అనుములలో 21.2 మి.మీ నమోదు కాగా చింతపల్లిలో 18.8, దామరచర్ల 17.8, మాడ్గులపల్లిలో 17.3, చిట్యాల 13.2, త్రిపురారం 10.3, తిప్పర్తి 9.8, నిడమనూరు 9.4, అడవిదేవులపల్లి 8.5, కట్టంగూర్ 8.1, తిరుమలగిరిసాగర్ 8.0, గుర్రంపోడు 7.3, దేవరకొండ 7.0, పెద్దవూర 5.9, వేములపల్లి 5.2, చందంపేట 5.2, నల్లగొండ 4.0, మిర్యాలగూడ 3.8, నార్కట్‌పల్లి 3.4, పీఏపల్లిలో 2.8 మి.మీ. వర్షం పడగా అత్యల్పంగా నకిరేకల్‌లో 2.0 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో సగటున 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 590.9 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 524.3 మి.మీటర్లు కురవగా 11శాతం లోటు నమోదైంది.

శుక్రవారం సైతం పలు మండలాల్లో ..
ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం రెండోరోజు జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం పెద్దవూర మండలంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురవగా సాయంత్రం హాలియా, నాగార్జునసాగర్ పురపాలికల పరిధితోపాటు శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...